వాల్మికి టైటిల్ పై వివాదం 

30 Jan,2019

మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం  వాల్మికి.. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు.. ఇటీవ‌లే పూజా కార్య‌క్రమాలు జ‌రుపుకుంది..ఈ సంద‌ర్భంగా టైటిల్ పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. వాల్మీకి అనే టైటిల్ ని పెట్టడమే కాకుండా టైటిల్ లోగో లో రివాల్వర్ ని యాడ్ చేయడంతో వాల్మికి కుల‌స్థులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.. రివాల్వ‌ర్ పెట్టి వాల్మీకిల‌ మనోభావాలను కించపరిచేలా చేశార‌ని చిత్ర యూనిట్ పై మండిప‌డుతున్నారు… వాల్మీకి కులస్థులకు క్షమాపణ చెప్పి ఆ టైటిల్ ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయం పై చిత్ర యూనిట్  ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Recent News