తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఉపాధ్యక్షుడిగా ఉప్పల్కు చెందిన నటుడు దర్శక నిర్మాత, రచయిత బల్లెం వేణుమాధవ్, కార్యదర్శిగా ఆకెళ్ళ, కోశాధికారిగా నటరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బల్లె వేణుమాధవ్ను పరుచూరి గోపాలకృష్ణ, సినీ ప్రముఖులు అభినందించారు. అనంతరం వేణుమాధవ్ మాట్టాడుతూ నూతన రచయితలను ప్రోత్సహించడంతోపాటు, వారి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో చరనా దేవాంగ, పరుచూరి వెంకటేశ్వర్రావు, వెనిగళ్ల రాంబాబు, విజయేంద్రప్రసాద్, బుర్రా సాయిమాధవ్, బోడపల్లి సాయినాథ్, నాగబాల సురే్షకుమార్ పాల్గొన్నారు.