అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' విడుదల తరువాత ఇంకా తన కొత్త సినిమాను ప్రారంభించలేదు. చాలా గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈమధ్య చేసిన సినిమాలు ప్రేక్షకులను సరిగా మెప్పించలేకపోవడంతో బన్నీ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడట. త్రివిక్రమ్ సినిమా ఫైనలైజ్ అయినా బన్నీ మాత్రం కథలు వింటున్నాడట.
రీసెంట్ గా యువ దర్శకుడు సుజిత్ స్టైలిష్ స్టార్ కు ఒక ఇంట్రెస్టింగ్ కథ వినిపించాడట. కథ నచ్చడంతో దానిని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా తీర్చిదిద్దమని బన్నీ సుజిత్ కు సూచించాడట. సుజిత్ ప్రస్తుతం ప్రభాస్ తో 'సాహో' ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ-త్రివిక్రమ్ సినిమా ప్రస్తుతం జోరుగా ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తయ్యే లోపు సుజిత్ కుడా 'సాహో' పూర్తి చేసి బన్నీ సినిమా పై ఫోకస్ పెట్టె ఛాన్స్ ఉంది.