రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం రెండవ షెడ్యూల్ తాజాగా ప్రారంభం అయ్యింది. మొదటి షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించిన దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం కూడా చరణ్ ఎన్టీఆర్ ల కాంబోలో కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక విషయంపై స్పీడ్ గా చర్చలు జరుపుతున్నారట. వచ్చే నెల నుండి హీరోయిన్స్ తో చిత్రీకరణకు దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేశాడట. ఇప్పటికే ఎంతో మంది పేర్లను పరిశీలించిన రాజమౌళి బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే పరిణితి చోప్రాను సంప్రదించడం వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని టాక్. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన పరిణితి చోప్రా ఈమద్య కాలంలో అక్కడ కాస్త సందడి తగ్గింది. మరో హీరోయిన్ ను కూడా బాలీవుడ్ భామనే ఎంపిక చేస్తారనే టాక్ వినిపిస్తుంది.