హన్సిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ పర్సనల్ ఫొటోస్ లీక్ 

26 Jan,2019

ఈ మధ్య పలువురు సినిమా తరాల ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవుతూ సోషల్ మీడియా లో వారికీ సంబందించిన పర్సనల్ ఫోటోలు లీకై సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే తాజాగా గ్లామర్ భామ హన్సిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవడమే కాకుండా ఆమెకు సంబందించిన పలు ఫోటోలు లీక్ అయ్యాయి.  విహారయాత్ర కోసం హన్సిక న్యూయార్క్ వెళ్లింది. అక్కడ దిగిన ఆమె వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనిపై హన్సిక స్పందించింది. తన ఫోన్, ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని తెలిపింది. వాటి ద్వారా వచ్చే సందేశాలకు స్పందించవద్దని అభిమానులను కోరింది. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు తన టీమ్ కృషి చేస్తోందని తెలిపింది. గతంలో అక్షరహాసన్, షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్ తదితరుల ఫొటోలు కూడా లీకయ్యాయి.

Recent News