అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ గా నటించి , మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ షాలిని తెలుగులో మాత్రం మంచి ఆఫర్లను దక్కించుకోలేక పోతుంది. చిన్న పాత్రలు సెకండ్ హీరోయిన్ పాత్రలే ఈమెకు దిక్కవుతున్నాయి. తమిళంలో '100% లవ్' చిత్ర రీమేక్ '100% కాదల్' చిత్రంలో నటిస్తోంది. షాలిని దక్కిన పెద్ద ఆఫర్ ఇప్పటి వరకు అదే. మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న ముద్దుగుమ్మ షాలిని పాండేకు బాలీవుడ్ లో మంచి ఆఫర్ దక్కింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న '118' చిత్రంలో షాలిని పాండే ఒక హీరోయిన్ గా నటిస్తుంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా మూడు నాలుగు సినిమాలు చేస్తున్న షాలిని పాండే తాజాగా బాలీవుడ్ లో పరేష్ రావల్ కుమారు ఆధిత్య హీరోగా పరిచయం కాబోతున్న 'బాంఫాడ్' చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో షాలిని పాండే బాలీవుడ్ లో మంచి విజయంతో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.