ప్రతి పార్లమెంటు ఎన్నికలు జరిగే సమయంలో బాలీవుడ్ నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.
బోపాల్ నుండి కరీనా కపూర్ తో పోటీ చేయించేందుకు కాంగ్రెస్ వారు ప్రయత్నాలు చేస్తున్నారంటూ జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె అభిమానుల్లో చర్చ మొదలైంది. ఈ సమయంలో కరీనా కపూర్ తన గురించి మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అసలు తాను రాజకీయాల గురించి ఆలోచించిందే లేదని తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని పేర్కొంది. ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదని నన్ను ఎవరు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించలేదు ఏ పార్టీ వారు నన్ను సంప్రదించలేదంది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీ పైనే ఉందని తాను మరే విషయాల గురించి ఆలోచించడం లేదు. రాజకీయాల్లో రాణించాలనే ఆశ నాకు లేదని క్లారిటీగా చెప్పింది.