కమల్ హాసన్ – శంకర్ కలయికలో భారతీయుడు సీక్వెల్ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ రోజు చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. భారతీయుడు మూవీ సీక్వెల్ కు తొలి క్లాప్ పడింది… అనంతరం తొలి షాట్ ను కమల్ హాసన్ పై చిత్రీకరించారు..కమల్ ఓల్డ్ గెటప్ లో కాకీ డ్రస్ వేసుకుని ఉన్నాడు. ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నది.. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుథ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని భారీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సినిమాలో తెలుగు కమెడియన్ వెన్నల కిషోర్ కూడా ఓ కామిక్ పాత్రను చేయనున్నాడు. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో శింబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2020లో ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది.