బోయపాటి దర్శకత్వంలో బాలయ్య 

18 Jan,2019

నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ సినిమా కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని టాక్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సంచలన విజయం అందుకోవడంతో ఈ హ్యాట్రిక్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బోయపాటి శ్రీను తాజాగా రామ్ చరణ్ తో తెరకెక్కించిన వినయ విధేయ రామ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ముక్యంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు టూ మచ్ గా ఉన్నాయంటూ మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. కేవలం యాక్షన్ కోసమే సినిమా చేసినట్టు ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ఇక నెక్స్ట్ సినిమా విషయంలో అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టిన బోయపాటి ఈ సినిమాలో బాలయ్య తో డ్యూయెల్ రోల్ చేయిస్తాడంటూ ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. 

Recent News