సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం మహర్షి. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పొలాచ్చి లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా కథ లీక్ అయిందంటూ సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే .. ఈ నేపథ్యంలో ఈ ఇసినిమా కథ గురించి రకరాలుగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ విదేశాల్లో ఉండే శ్రీమంతుడిగా కనిపిస్తుండగా .. అల్లరి నరేష్ ఓ మారుమూల పల్లెలో బీదవాడిగా కనిపిస్తాడట. వీరిద్దరూ కలిసి స్కూల్ చదువు నుండి మిత్రులు ..ఆలా ప్రాణ స్నేహితులుగా కనిపిస్తారని, ఒకరకంగా చెప్పాలంటే కుచేలుడికోసం వెదుక్కుంటూ వచ్చే కృష్ణుడు కథనే ఈ సినిమాలో అన్వయించేశారని టాక్. మొత్తానికి అటు ప్రేక్షకుల్లో ఇటు మహేష్ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా కథ విషయంలో వస్తున్న కథనాలు ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.