మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా, సైరా చిత్రబృందం సినిమాలో విజయ్ సేతుపతి లుక్ ని రివీల్ చేస్తూ పోస్టర్ ను అండ్ మోషన్ టీజర్ ను విడుదల చేసింది. 2018లో అతడు అరడజను సినిమాల్లో నటించాడు. 2019లో మరో అరడజను సినిమాలు క్యూలో ఉన్నాయి. వీటిలో సైరా- నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రం ఉంది. ఓబయ్య అనే విప్లవకారుడి పాత్రలో అతడు నటిస్తున్నాడు. తాజాగా అతడి పాత్ర లుక్ ని సైరా టీమ్ రిలీజ్ చేసింది. మోషన్ టీజర్ లో విజయ్ సేతుపతి కత్తి పట్టుకొని రౌద్రమైన్ లుక్ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నయన తార, తమన్నా, సుధీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.