నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ‘ఆర్ ఎక్స్ 100 ’ ఫేమ్ కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ఒంగోలులో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ “మా ‘ఆర్ ఎక్స్ 100’ విడుదలైన తర్వాత చాలా కథలు విన్నాను. వాటిలో నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాను’. అని అన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ `‘నేను బోయపాటి శ్రీనుగారి దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశాను. కార్తికేయగారు వల్లనే ఈ చిత్రం ఇంత త్వరగా పట్టాలెక్కింది. నిర్మాతలు కథ మీద నమ్మకంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేయాలనే ప్యాషన్తో ఉన్నారు. కథానుగుణంగా ఒంగోలులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం“ అని చెప్పారు. నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ `నేటి నుంచి ఫిబ్రవరి 8 వరకు ఒంగోలు పరిసరాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను, రెండు పాటలను తెరకెక్కిస్తాం. సినిమా టైటిల్ను త్వరలోనే వెల్లడిస్తాం“ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్, కెమరామెన్: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ రామ్.