మహేష్ తో బోయపాటి సినిమా 

13 Jan,2019

మాస్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న బోయపాటి శ్రీను తాజా చిత్రం వినయ విధేయ రామ పై భిన్నమైన టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తో దర్శకుడు చేయించిన విన్యాసాలు ఓ రేంజ్ లో ఉన్నాయ్. ప్రస్తుతం మెగా అభిమానులు వినయ విధేయ రామ విషయంలో చాలా టెన్షన్ పై ఉన్నారు. ఇక బోయపాటి శ్రీను నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న విషయంలో ఓ ఆసక్తికర న్యూస్ హల్చల్ చేస్తుంది ? అదేమిటంటే .. బోయపాటి నెక్స్ట్ సినిమా చిరంజీవి తో ఉంటుందని అంటున్నారు .. అలాగే మహేష్ బాబుతో కూడా అయన సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మహేష్ కెరీర్ లో కూడా పక్కా మాస్ సినిమా చేయలేదు కాబట్టి .. బోయపాటి తో చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట మహేష్. ఒకవేళ నిజంగానే మహేష్ తో బోయపాటి సినిమా కమిట్ అయితే .. ఎలా అన్న టెన్షన్ లో ఉన్నారట మహేష్ ఫాన్స్ !! నిజమే .. యాక్షన్ విషయంలో బోయపాటి ఆలోచనలు కాస్త తగ్గితే బెటర్ .. లేదంటే .. అరాచకాలే !!
 

Recent News