సినిమా హీరోల అభ్హిమానులు ఎలా ఉంటారో అన్న సంఘటనలు .. హీరోలపై విపరీతమైన అభిమానం ఇప్పటికే చాల సార్లు చూసాం .. తమ హీరోని ఎవరేమన్నా ఊరుకోరు .. స్టార్ హీరోల ఫాలోయింగ్ అలాంటిది మరి. తెలుగులో కంటే తమిళ జనాల్లో అభిమానం ఓ రేంజ్ ఎక్కువగానే ఉంటుంది .. అది ఎంత మూర్ఖంగా ఉంటుందో తాజా సంఘటన చుస్తే అర్థం అవుతుంది. తమిళనాట అజిత్ విజయ్ రజినీకాంత్ అభిమానుల మద్య ఎప్పటికి గొడవ నడుస్తూనే ఉంటుంది. అలాంటి ఫ్యాన్స్ మద్య ఒక్క చోట వందల సంఖ్యలో చేరితే ఏమైనా ఉందా అనుకున్నట్లుగానే ఇరు వర్గాల ఫ్యాన్స్ మద్య బీభత్సమైన పోరు జరిగింది. థియేటర్లు రణరంగమైనాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేట’ మరియు అజిత్ ‘విశ్వాసం’ చిత్రాలు సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఆడుతున్న మల్టీ ప్లెక్స్ మరియు పక్క పక్కన థియేటర్ల వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడినది. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రెండు వర్గాల వారు ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకున్నారు. రెండు సినిమాలు విడుదలైన పలు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వేలూరులోని ఓ థియేటర్ ముందు ఇరు వర్గాల అభిమానులు కత్తులతో - కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో దాదాపు అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారని పదిమంది పాక్షికంగా గాయాలపాలయ్యారని సమాచారం అందుతోంది. కత్తులతో దాడి నేపథ్యంలో వెలూరు మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది.