బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జీరో’ భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలై బాక్సాఫిస్ వద్ద చతికిల పడింది. అయితే షారుక్ , అనుష్క శర్మ ల నటన కు ప్రశంసలు దక్కాయి. ఇక షారుక్ ఈచిత్రం తరువాత బయోపిక్ లో నటించడానికి సిద్దమవుతున్నాడు. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త రాకేష్ శర్మ జీవితం ఆధారంగా ‘సెల్యూట్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్, రాకేష్ శర్మ పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ మతాహి తెరకెక్కించనున్న ఈచిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ఫస్ట్ షెడ్యూల్ కోసం ముంబై లోని ఫిలిం సిటీ లో భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సిద్దార్ధ రాయ్ కపూర్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈచిత్రం కోసం పూర్తిగా కొత్త లుక్ లోకి మారనున్నాడట షారుక్.