మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లాస్ట్ ఇయర్ 'విజేత' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాన్ దేవ్ ఇప్పుడు పులి వాసు దర్శకత్వంలో తన రెండో సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారట. హిందీలో 'హాఫ్ గర్ల్ 'ఫ్రెండ్'.. 'బ్యాంక్ చోర్'.. 'జలేబి' లాంటి సినిమాలో నటించింది. ఈ భామ తెలుగులో కూడా 'తూనీగా తూనీగా' అనే సినిమా కూడా చేసింది.. ఎన్ని సినిమాలు చేసినా 'జలేబీ' లో ఆమె హీరోకిచ్చిన జిమ్నాస్టిక్ కిస్సులు ఆమెకు చాలా గుర్తింపును తీసుకొచ్చాయి. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ సినిమా ద్వారా మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇస్తే మంచి బ్రేక్ దొరకడం ఖాయమే. రాజేంద్ర ప్రసాద్.. పోనాని కృష్ణ మురళి ఇతార ముఖ్య పాత్రల్లో నటిస్తారట. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా కంప్లీట్ అయ్యాయట. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.