శ్రీ విష్ణు హీరోగా బ్రోచేవారెవరురా 

30 Dec,2018

యంగ్ హీరో శ్రీ విష్ణు, దర్శకుడు వివేక్ ఆత్రేయ రెండోసారి జతకట్టబోతున్నారు. మెంటల్ మదిలో లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ సారి క్రైమ్ కామెడీతో రాబోతున్నారు ఈ జోడి. ఈ చిత్రానికి బ్రోచేవారెవరురా అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నివేదాథామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయకుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent News