ఫన్ ఫన్ ఆన్ లిమిటెడ్ 

31 Dec,2018

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్‌ 2'. 'ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' ట్యాగ్‌ లైన్‌. అనిల్‌ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన పాటలను వైజాగ్‌  లో   విడుదల చేశారు. ఆడియో సీడీలను ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో...దిల్‌రాజు మాట్లాడుతూ - ''2004లో నేను, బన్ని న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను ఇక్కడే చేసుకున్నాం. ఈ వేడుకకి వచ్చేటప్పుడు అదే గుర్తుకు వచ్చింది. 2017 సంక్రాంతికి మూడు సినిమాలు విడుదలైనప్పుడు చాలా పెద్ద కాంపీటీషన్‌ అని ఫీలయ్యాం. గౌతమిపుత్రశాతకర్ణి ఓ క్లాసిక్‌ సినిమాలా నిలిచింది. మెగాస్టార్‌గారి 150వ సినిమా ఖైదీ నంబర్‌ 150 ఇండస్ట్రీ రికార్డ్‌ అయ్యింది. శతమానం భవతి మంచి సినిమా అయ్యి నేషనల్‌ అవార్డ్‌ను సాధించింది. ఇప్పుడు మళ్లీ 2019లో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. బాలయ్యగారి యన్‌.టి.ఆర్‌ బయోపిక్‌, రామ్‌చరణ్‌గారి వినయవిధేయరామ, మా ఎఫ్‌2..ఈ సంక్రాంతికి ఈ మూడు సినిమాలు పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్‌గారితో మా బ్యానర్‌లో చేసిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సంక్రాంతికి విడుదలై పెద్ద విజయాన్ని సాధిస్తే... వరుణ్‌తో ఫిదా సినిమా చేశాం. ఇద్దరూ కలిసి మా బ్యానర్‌లో మల్టీస్టారర్‌ చేశారు. వారిద్దరి గురించి నేను చెప్పేదేమీ లేదు. ఇద్దరూ నిర్మాతల హీరోలు. ఈ సినిమా జరుగుతున్న రోజులు సరదాగా, ఫ్రెండ్‌లా వెళ్లి సెట్‌లో ఎంజాయ్‌ చేసి వచ్చేవాడిని. అంత కంఫర్ట్‌ను క్రియేట్‌ చేసే హీరోలు వాళ్లు. ఇమిడియేట్‌గా మరో స్క్రిప్ట్‌ వస్తే మరో సినిమా చేయాలనేంత కోరికగా ఉంది. వరుణ్‌ నాకు ఫ్యామిలీ మెంబర్‌. చిరంజీవిగారి నుండి మంచి లక్షణాలు నేర్చుకుని కొత్త కొత్త సినిమాలు చేస్తూ తను ఎదుగుతున్నాడు. ఎఫ్‌2 ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు వరుణ్‌ మరింత దగ్గరవుతాడు. తను మా పవర్‌స్టార్‌. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఎఫ్‌ 2 కథ చెబుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ప్రతి భార్యాభర్త మధ్య ఫన్‌ ఉంటుంది, ఫ్రస్టేషన్‌ ఉంటుంది. స్క్రిప్ట్‌ చెప్పినరోజునే మా బ్యానర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా రాబోతుందని తెలుసు. దానికి తగ్గట్లు ఇద్దరు హీరోలు, మంచి హీరోయిన్స్‌, ఇతర టెక్నీషియన్స్‌ బాగా కుదిరారు. అనిల్‌తో ఇంతకు ముందు చేసిన సుప్రీమ్‌, రాజాదిగ్రేట్‌ కమర్షియల్‌ సినిమాలు అయితే ఎఫ్‌ 2 పక్కా ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీతో వచ్చే ఆడియెన్స్‌ రెండున్నర గంటల సేపు నవ్వుకుంటారు. అందుకనే సంక్రాంతి అల్లుళ్లు వస్తున్నారు అనే మరో ట్యాగ్‌లైన్‌ను కూడా అనిల్‌ యాడ్‌ చేశాడు. ఒకరు ఆంధ్ర అల్లుడైతే, ఒకరు తెలంగాణ అల్లుడు. ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకు నచ్చావ్‌లో వెంకటేశ్‌గారిని చూస్తున్నట్లు ఉంది. అనిల్‌కి ఇది నాలుగో సినిమా. మా బ్యానర్‌లో మూడో సినిమా. తప్పకుండా హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాం. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌తో ఆర్య నుండి ఎఫ్‌2 వరకు పది సినిమాలు. ముందు తొమ్మిది సినిమాలు సక్సెస్‌ఫుల్‌ సినిమాలయ్యాయి. దేవి చాలా కేర్‌ తీసుకుంటాడు. కాబట్టి కాంబినేషన్‌ కంటిన్యూ అవుతుంది'' అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''విశాఖ ఉత్సవం ఒక బ్రాండ్‌. వైజాగ్‌కి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు తెచ్చిపెట్టిన రాష్ట్ర పండుగ ఇది. వైజాగ్‌ స్మార్ట్‌ సిటీ. ఇండియాలో ఇంత మంచి సిటీ ఉందా అని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. సినీ పరిశ్రమ వైజాగ్‌కు తరలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రామానాయుడగారు పార్లమెంట్‌ సభ్యులుగా పనిచేసినప్పుడు ఆయన్ను స్టూడియో పెట్టమని అడిగినప్పుడు ఆయన స్టూడియో పెట్టారు. త్వరలోనే వైజాగ్‌ స్టూడియోలో నిర్మాణాలు జరిగేలా చూస్తామని వెంకటేష్‌గారు కూడా అన్నారు. వైజాగ్‌ సినిమాలకు సెంటిమెంట్‌గా మారింది. షూటింగ్‌లకు అనువుగా ఉండేలా వసతులు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్‌లో ఇక్కడ ప్రతి సినిమాలో కొంత షూటింగ్‌ చేసుకునేలా ప్లాన్‌ చేసుకుంటే బావుంటుంది. అన్నారు.
వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ - ''వైజాగ్‌ నాకు చాలా క్లోజ్‌. నేను యాక్టింగ్‌ ఇక్కడ సత్యానంద్‌గారి దగ్గరే నేర్చుకున్నాను. దేవ్రిశ్రీ ప్రసాద్‌తోతొలిసారి పని చేశాను. తనతో త్వరలోనే సినిమా చేయాలనుకుంటున్నాను.  దర్శకుడు అనిల్‌గారు ధైర్యం చేసి నాకు మంచి పాత్ర ఇచ్చాడు. అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. వెంకటేశ్‌గారితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఫ్రెండ్‌లా, గైడ్‌లా నా పక్కనే ఉండి నన్ను ఎంకరేజ్‌ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ థాంక్స్‌ అన్నారు.
విక్టరీ వెంకటేశ్‌ మాట్లాడుతూ - ''నా తొలి సినిమా కలియుగ పాండవులు నుండి చాలా సినిమాలు స్వర్ణ కమలం, సుందరకాండ, మల్లీశ్వరి, గురు .. ఇలా చాలా చిత్రాలను వైజాగ్‌లో చేశాం. వైజాగ్‌ ఉత్సవాల్లో మా సినిమా పాటలను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన గంటా శ్రీనివాసరావుగారికి థాంక్స్‌. ఎఫ్‌ 2లో అనిల్‌ వండర్‌ ఫుల్‌ స్క్రిప్ట్‌ రాశాడు. అనిల్‌ నా గత చిత్రాలన్నింటినీ చూసి వాటిన్నంటి కంటే రెచ్చిపోయేలా ఈ సినిమాలో నటింపచేశాడు. ఈ సినిమాలకు పనిచేస్తున్న సమయంలో ఎంజాయ్‌ చేశాను.  అన్నారు.

Recent News