అమర్ అక్బర్ ఆంటోని సినిమా పరాజయంతో శ్రీను వైట్ల పరిస్థితి మరి రివర్స్ గామారింది. వరుణ్ తేజ్ తో చేసిన మిస్టర్ సినిమా దెబ్బకు నెక్స్ట్ ఛాన్స్ పట్టేందుకు చాలా సమయం పట్టడంతో ఇప్పుడు రవితేజ తో చేసిన ట్రిపుల్ ఏ సినిమా దెబ్బకు ఆయనకు అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు . ఇంతకి అసలు విషయం ఏమిటంటే శ్రీను వైట్ల నెక్స్ట్ సినిమా అఖిల్ తో చేయాలనీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జునను కలిసాడని .. కానీ నాగ్ మాత్రం శ్రీను వైట్ల పై సంతృప్తిగా లేదని .. శ్రీను వైట్ల కథ చెప్పాలని ట్రై చేసిన మరోసారి చూద్దామని చెప్పాడని టాక్. అయితే దీనికి కారణం అఖిల్ ని హీరోగా నిలబెట్టే క్రమంలో శ్రీను వైట్ల తో కూడా నాగ్ చర్చలు జరిపాడు .. ఒకవేళ అది వర్కవుట్ అయితే అఖిల్ రెండో సినిమా శ్రీను వైట్ల చేసే ఛాన్స్ ఉండేది .. కానీ రామ్ చరణ్ తో బ్రుస్లీ కన్ఫర్మ్ కావడంతో నాగార్జున ను పక్కనపెట్టి ఆ సినిమా చేసాడు శ్రీనువైట్ల. దాంతో బాగా ఫీల్ అయినా నాగ్ .. ఇప్పడు శ్రీను వైట్లను పక్కన పెట్టినట్టు టాక్. ఇప్పటికే పలువురితో చర్చలు జరుపుతున్న శ్రీను వైట్ల కు నెక్స్ట్ సినిమా ఎవరిస్తారో చూడాలి.