ఐటెంగర్ల్ గా మారిన నభ నటేష్  

16 Apr,2019

మొదటి సినిమాతోనే మంచి  ఇమేజ్ తెచ్చుకున్న కన్నడ భామ నభ నటేష్ నటించిన నటించిన తోలి సినిమా నన్ను దోచుకుందువటే. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా కూల్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత నభ నటేష్ కు తెలుగులో పలు అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ అమ్మడు పూరి జగన్నాద్ - రామ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తుంది.  
తాజాగా ఈ సినిమా కోసం ఓ హాట్ ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నారు. నభ నటేష్ ఐటెం గర్ల్ గా ఈ అమ్మడు చిందేస్తుంది. 

ఈ మధ్య హీరోయిన్స్ కేవలం హీరోయిన్ పాత్రల్లోనే నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఐటెం సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకునేందుకు, లేదా నెగెటివ్ లీడ్ అయినా సరే ఓకే చెబుతున్నారు. అదే కోవలో నభ నటేష్ ఐటెం సాంగ్స్ తో కూడా తన క్రేజ్ పెంచుకునే పనిలో పడింది. తాజాగా ఈ అమ్మడు చిందేస్తున్న సాంగ్ కి సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

హాట్ ఐటెం గర్ల్ గా నభ నటేష్ దుమారం రేపడం ఖాయమని సినీ జనాలు అంటున్నారు. ఎందుకంటే సాంగ్ ఆ రేంజ్ లో వచ్చిందట. పక్కా తెలంగాణ స్లాంగ్ లో హీరో నటిస్తున్న ఈ సాంగ్ కూడా తెలంగాణ స్లాంగ్ లోనే సాగుతుందట.  కన్నడంలో కూడా రెండు సినిమాల్లో నటించిన ఈ అమ్మడి ఫోకస్ టాలీవుడ్ పై పడింది. నిజానికి నభ తొలిసినిమా రఘుబాబు తెరకెక్కించిన అదిగో. పందిపిల్ల లీడ్ పాత్రలో వచ్చిన ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ అయింది .. ఆ తరువాత వెంటనే విడుదల అయిన నన్ను దోచుకుందువటే సినిమా హిట్టవ్వడంతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నభ నటేష్ మరో రెండు సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.  
 

Recent News