దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ క్యామియో చేస్తాడని. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ప్రభాస్ గెస్ట్ రోల్ అన్న న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే .. బాహుబలి లాంటి సంచలన విజయాన్ని అందుకున్న రాజమౌళి కొంత గ్యాప్ తరువాత చేస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు హీరోలుగా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకుంది.
ఈ సినిమా రెండో షెడ్యూల్ పూణే లో ప్లాన్ చేసారు. అక్కడ షూటింగ్ జరుగుతుండగా రామ్ చరణ్ కాలికి గాయం అవ్వడంతో ఆయనకు బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ ఈ నెల చివరి వారం నుండి షూటింగ్ లో పాల్గొననున్నాడు చరణ్. అయితే ఇందులో ప్రభాస్ కూడా ఓ చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. నిజానికి ఇందులో ప్రభాస్ రోల్ ఏమిటన్న ప్రశ్న వ్యక్తం అవుతుంది. నిజంగా ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తే సినిమా రేంజ్ మరో స్థాయికి చేరుతుంది. కానీ ప్రభాస్ నటించే అవకాశాలు నిజంగా ఉన్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ పూర్తీ చేసాడు. దాంతో పాటు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. అలాగే దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమాకు కమిట్ అయ్యాడు ప్రభాస్. ఇలా బిజీ షెడ్యూల్ మధ్య ప్రభాస్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ న్యూస్ పై యూనిట్ నుండి ఎలాంటి సమాచారం లేదు. మరి ఈ విషయం పై యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.