మెగా ప్రశంసల్లో చిత్రలహరి టీం 

16 Apr,2019

సాయి తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరి ఈ శుక్రవారం విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుని వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న సాయి తేజ్ కి కాస్త ఊరటనిచ్చింది. ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా దూసుకుపోతూ సమ్మర్ వసూళ్లను రాబట్టుకుంటూ తన ఖాతాలో వేసుకుంటుంది.  తాజాగా ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా షో వేసి సినిమా చూపించారు నిర్మాతలు. 

సినిమా చుసిన మెగాస్టార్ సినిమా సూపర్ హిట్టంటూ తెగ మెచ్చుకున్నాడట. ముఖ్యంగా తన మేనల్లుడు సాయి తేజ్ నటనలో చాలా పరిణితి కనిపించిందని చెప్పాడు. అలాగే మిగతా నటీనటులు కూడా బాగా చేసారని , దర్శకుడు కిశోర్ కథను అద్భుతంగా డీల్ చేసాడని చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన లక్ష్యం కోసం పట్టుదలతో యువత ముందుకు సాగాలనే సందేశాన్ని సినిమా ద్వారా అయన చూపించిన విధానం బాగుంది. ఈ సందర్బంగా నేను దర్శకుడు కిషోర్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంటూ మెగాస్టార్ మెగా ప్రశంశలు కురిపించాడు. ఇక ఇప్పటికే తెలుగులో మైత్రి మూవీస్ బ్యానర్ వాళ్ళు .. గొప్ప గొప్ప చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతలుగా తమదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు. నిజంగా వారికీ నా ప్రత్యేక అభినందనలు అని తెలిపారు. 

ఈ సినిమాకు దేవి శ్రీ మ్యూజిక్,  సునీల్, పోసాని ల నటన హైలెట్ గా నిలుస్తుందని అన్నారు. సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని జంట బాగుందని, మరో హీరోయిన్ నివేద పేతురేజ్ తనదైన పాత్రలో అదరగొట్టింది చెప్పారు .. మొత్తానికి మెగాస్టార్ ప్రశంశలతో చిత్రలహరి టీం పరవశించింది. మొదటి వీకెండ్లోనే భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Recent News