తెరపైకి దాసరి జీవితం 

16 Apr,2019

ఈ మధ్య సినిమాల్లో బయోపిక్ ట్రెండ్  మహానటి సినిమాతో టాలీవుడ్ లోకూడా మొదలైంది. అయితే మహానటి ఇచ్చిన సక్సెస్ ఆ తరువాత అన్న నందమూరి తారకరామారావు బయోపిక్ విషయంలో ఫలితం తారుమారవ్వడంతో ఇక బయోపిక్స్ తెలుగులో రావేమో అనుకున్నారు సినీ ప్రేమికులు. కానీ ఇప్పటికి కొన్ని బియోపిక్స్ సెట్స్ పైన ఉండి ఈ తరహా సినిమాలకు కొత్త ఊతం ఇస్తున్నాయి. ఇప్పటికే కత్తి వీరుడు కాంతారావు జీవిత కథతో రాకుమారుడు పేరుతొ ఓ బయోపిక్ తెరకెక్కుతుంది. దాంతో పాటు ఘంటసాల బయోపిక్ సిద్ధం అవుతున్నాయి. అలాగే దర్శక రత్న గా సినీ కార్మికులకు ఎప్పుడు అందండలు అందించే దాసరి నారాయణ రావు జీవిత కథకూడా  తెరకెక్కుతుందంటూ ప్రచారం జరుగుతుంది. నిజానికి ఏ సినిమా రంగంలో లేనంతమంది శిష్యులు ఒక్క దాసరికే  ఉన్నారు. 

కష్టాల్లో ఉన్నామంటే నేనున్నానంటూ ముందుండి వారికి తగిన సహాయం చేయడం ఒక్క దాసరికి చెల్లింది. ఆయననుండి సహాయం పొందిన వారు ఎందరో ఉన్నారు.  వారిలో కొందరు దాసరి విగ్రహాలు పెట్టారు .. బయోపిక్ కూడా తీయాలని ప్రయత్నాలు కూడా చేసారు ..కానీ అది వర్కవుట్ కాకపోవడంతో పాటు శిష్యులు కూడా గ్రూపులు గ్రూపులుగా మారిపోయి విడిపోయారు.  దాంతో అయన బయోపిక్ అటకెక్కింది.  తాజాగా అయన శిష్యులు కొందరు కలిసి  బయోపిక్ కోసం సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దాసరి శిష్యుడు, ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ దాసరి బయోపిక్ కోసం సన్నాహాలు మొదలు పెట్టారట. అయితే ఇది సినిమాగా వస్తుందా ? లేక డాక్యుమెంటరీనా అన్న విషయం పై సందేహాలు ఉన్నాయ్. నిజానికి దాసరి జీవితం నేటి తరాలకు ఆదర్శంగా నిలవడం ఖాయం. 

చిన్నప్పటినుండి నానా కష్టాలు పడి చదువుకుని, చెప్పులు లేకుండా చెన్నై లో సినీ ప్రయత్నాలు మొదలెట్టి .. దర్శకుడిగా స్టార్ ఇమేజ్ అందుకున్న అయన లైఫ్ హిస్టరీ నిజంగా అందరికి స్ఫూర్తి. ఇలాంటి మహావ్యక్తుల జీవిత కథలు నేటి తరానికి అందిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.  

Recent News