హిందీలో సూపర్ హిట్టయిన గల్లీ బాయ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తాడని వార్తలు వచ్చాయి. తాజాగా చిత్రలహరి సినిమా ప్రమోషన్ లో ఈ వార్తలపై స్పందించిన సాయి తేజ్ అసలు ఈ సినిమాను రీమేక్ చేయడానికి తనను ఎవరు సంప్రదించలేదని చెప్పారు. దాంతో అయన చేయడం లేదన్న విషయం ఫిక్స్ అయింది .. ఆ వెంటనే గల్లీ బాయ్ రీమేక్ చేసేది సాయి తేజ్ కాదు .. విజయ్ దేవరకొండ అంటూ మరో ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో బిజీగా ఉన్న విజయ దేవరకొండ మరో వైపు మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో తన సినిమాలు ప్లాన్ చేసుకుంటుండగా .. విజయ్ దేవరకొండ తాజాగా హిందీలో సూపర్ హిట్టయిన గల్లీ బాయ్ చిత్రాన్ని రీమేక్ చేస్తాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
ఈ విషయం తెలియడంతో వెంటనే స్పందించిన విజయ్ తాను హిందీ గల్లీ బాయ్ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అసలీ సినిమా గురించి ఇప్పటిదాకా తనను ఎవరు అడగలేదని కూడా చెప్పారు. సో గల్లీ బాయ్ రీమేక్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని అర్థం అవుతుంది. రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో విడుదలై ఏకంగా 300 కోట్ల వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. ఓ మామూలు గల్లీ లో పుట్టి పెరిగిన కుర్రాడు తన జీవితం ఎదో పని చేసుకు సామాన్యుడిగా బతకడం కరెక్ట్ కాదని తెలుసుకుని .. తనలో ఓ మంచి రాప్పర్ ఉన్నాడని గ్రహించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఏ విజయం అయినా సులభంగా ఎందుకు వస్తుంది చెప్పండి .. అందులో ఎన్నో అవమానాలు, హేళనలు అయినా తన లక్ష్యాన్ని చేరి గల్లీ బాయ్ గా సక్సెస్ సాధిస్తాడు. మంచి కంటెంట్ తో తెరకెక్కిన సినిమా ఇది.