బంగార్రాజుకు నో చెప్పిన నయనతార 

12 Apr,2019

తెలుగులో నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం, అందులో బంగార్రాజు పాత్ర నాగ్ కు బాగా నచ్చడంతో దానికి సీక్వెల్ చేయడానికి ఆసక్తి చూపించాడు నాగ్. దాంతో రంగంలోకి దిగిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తీ కావొచ్చాయి.

ఈ సినిమాలో నాగ్ సరసన హీరోయిన్ ఎవరన్న విషయం పై పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలించిన యూనిట్ నయనతార అయితే బెటర్ అని ఆమెతో చర్చలు జరిపారు. ఐతే ఈ టీమ్ కు నయన్ షాకిచ్చింది. ఈ సినిమాలో తాను నటించడం లేదని చెప్పేసిందట. ప్రస్తుతం నయనతార ఒకేసారి నాలుగు తమిళ చిత్రాల్లో బిజీగా ఉండడంతో డేట్స్ ఈ సినిమాకు ఇవ్వడం కుదరదని చెప్పిందట. దాంతో నయనతార పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పుడు నయనతార నో చెప్పడంతో నెక్స్ట్ హీరోయిన్ ఎవరన్న విషయం పై సందిగ్దత నెలకొంది. గతంలో నయనతార, నాగ్ తో కలిసి బాస్, గ్రీకువీరుడు సినిమాలు చేసింది .. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా సరే .. నయనతార అయితేనే ఈ కథను యాప్ట్ అని భావించారు. కానీ ఆమె నో చెప్పడంతో బంగార్రాజు సరసన హీరోయిన్ ఎవరు ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

Recent News