త్రివిక్రమ్ తో సూపర్ స్టార్ 

12 Apr,2019

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం అయన ఫాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.  దానికి తగ్గట్టే మహేష్ బాబు కోసం స్టార్ డైరెక్టర్లే కాకుండా ఈ జెనరేషన్ డైరెక్టర్లు కూడా ఎంతో మంది సీరియస్ గా ట్రై చేస్తుంటారు.  మహేష్ ప్రస్తుతం 'మహర్షి' లో నటిస్తున్నాడు.  ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. 
అనిల్ రావిపూడి తర్వాత మహేష్ బాబు సినిమా చేసేందుకు పరశురామ్ లైన్లో ఉన్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.  ఇక తాజా సమాచారం ప్రకారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్ సినిమా  డైరెక్టర్స్ లిస్టులో ఉన్నాడట.  ప్రస్తుతం మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక అడ్వర్ టైజ్ మెంట్ షూట్ జరుగుతోంది.  ఈరోజే ఆ యాడ్ షూటింగ్ జరిగిందట.  ఈ సందర్భంగా మహేష్ తో మరోసినిమా చేయాలని ఉందని త్రివిక్రమ్ చెప్పడం.. అందుకు మహేష్ మంచి కథ ఉంటే చెప్పమని త్రివిక్రమ్ ను కోరడం జరిగాయట.  అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని టాక్. 

Recent News