నరేంద్ర మోడీకి ఎన్నికల సెగ 

11 Apr,2019

నరేంద్ర మోడీకి సెన్సార్ చిక్కులు తప్పేలా లేవు ? బాలీవుడ్ లో ప్రధాని నరేంద్ర మోడీ  జీవిత కథతో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో పాత్రలో నటిస్తున్న చిత్రం నరేంద్ర మోడీ. ఈ ఎన్నికలకు ముందే చిత్రాన్ని విడుదల చేయాలనీ ప్లాన్ చేసారు, కానీ ఎన్నికల కమీషన్ ఈ సినిమాను విడుదల చేయొద్దంటూ పేర్కొనడంతో విడుదల ఆగిపోయింది, దాంతో విడుదల కోసం నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. నిజానికి మర్చి 29న సినిమా విడుదలకు ప్లాన్ చేసారు. ఈసీ అడ్డు చెప్పడంతో విడుదల వాయిదా పడింది. ఆ తరువాత ఏప్రిల్ 6న విడుదల చేయాలనీ మరోసారి ప్రయత్నం చేసారు, కానీ ఈ సినిమా సెన్సార్ విషయంలో సెన్సార్ బోర్డు ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని ఈ కేసును విచారిస్తున్న సుప్రీం బెంచ్ పేర్కొన్నది. అయినా సరే ఎంతకైనా పోరాడి ఈ సినిమాను ఈ ఎన్నికల ముందు విడుదల చేయాలని  ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా విడుదల విషయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. 

ఈ ఎన్నికల సందర్బంగా ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి జీవిత కథలను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు విడుదల చేసే అవకాశం లేదని ఎన్నికల సంఘం పేర్కొన్నది. దాంతో నరేంద్ర మోడీ సినిమాకు సెన్సార్ కష్టాలతో పాటు అటు ఈసీ కష్టాలు టెన్షన్ పెడుతున్నాయి.  నరేంద్ర మోడీ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా బిజెపి పార్టీకి ఓ మంచి ప్రచారంగా భావిస్తున్నారు. మోడీ  తన జీవితంలో ఎలా ఎదిగాడు  అన్న కోణం నుండి, అయన ప్రధానిగా ఎదిగి ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసాడు అన్నది ప్రధానాంశంగా తీసుకుని ఈ సినిమా తీశారు. అయితే ఈ సినిమా విడుదల ఆపాలంటూ అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. మొత్తానికి ఎన్నికల తరువాతే మోడీకి విడుదల ఉంటుందేమో చూడాలి.   

Recent News