జాతీయ నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న సూపర్ స్టార్ కమల్ హాసన్ ఇకపై సినిమాల్లో నటించేది లేదని పేర్కొన్నాడు ? ఇకపై తన నట జీవితానికి స్వస్తి పలుకుతానని, [పూర్తీ సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని ఈ మద్యే అయన ఓ సందర్బంగా అన్నారు. ఆ మాటలు విన్న కమల్ అభిమానులు అయోమయంలో పడ్డారు .. కమల్ పూర్తిగా సినిమాలు మానేస్తారా లేకా ఈ ఎన్నికల తరువాత మళ్ళీ సినిమాలు చేస్తారా అంటూ చర్చలు జరుపుకుంటున్నారు. అయితే కమల్ సన్నిహితుల నుండి వస్తున్న సమాచారం ప్రకారం .. ఇకపై కమల్ రెండు పడవలపై ప్రయాణం చేయడని, అయన పూర్తిగా రాజకీయాలకే సమయం వెచ్చిస్తారంటూ చెబుతున్నారు ? తాజాగా ఈ విషయం పై స్పందించిన కమల్ ఓ మీటింగ్ లో మాట్లాడుతూ .. నా అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే నేను సినిమాలు మేనెయ్యాలని అనుకుంటున్నాను .. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్నాను. నేను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చాను కాబట్టి ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ పనులన్నీ తొందరగా పూర్తీ చేయాలి. కాబట్టి సినిమాల్లో నటించేది లేదని క్లారిటీ ఇచ్చేసాడు. దాంతో అయన ఫాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు ? తాజాగా అయన నటిస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ జరుగుతుంది. మరి ఈ సినిమా చేసాకా మానేస్తారా ? లేక మధ్యలోనే ఆగిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వెండితెరపై ప్రపంచంలో ఏ నటుడు చేయనన్ని భిన్నమైన పాత్రలు చేసిన ఏకైక హీరో కమల్ హాసన్.