మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన 150 వ సినిమా "ఖైదీ నంబర్ 150'' తో రీ ఎంట్రీ ఇచ్చి సంచలన విజయాన్ని అందుకుని ఇంకా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసాడు. ఆ సినిమాతో ఏకంగా 100 కోట్ల మార్కెట్ ని కొల్లగొట్టాడు. ఆ సినిమా తరువాత భారీ బడ్జెట్ తో సైరా చిత్రంలో నటిస్తున్నాడు చిరు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను ఆగస్టు లో విడుదల చేస్తారట. ఇక మెగాస్టార్ 152వ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిన ఈ సినిమాకోసం కొరటాల శివ అద్భుతమైన కథను సిద్ధం చేసాడట. కథ చెప్పగానే మెగాస్టార్ కు బాగా నచ్చి వెంటనే ప్రొసీడ్ అన్నాడట. దాంతో రంగంలోకి దిగిన కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తీ చేసాడట. చిరంజీవి ఫ్రీ అయితే వెంటనే షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీగా ఉన్నాడు. అన్నట్టు ఈ సినిమాకోసం హీరోయిన్స్ ని కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా మిల్కి బ్యూటీ తమన్నా ను ఎంపిక చేసినట్టు టాక్ . ఇక మరో కీ రోల్ లో గ్లామర్ భామ శృతి హాసన్ నటిస్తుందట. ఈ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ నిర్మిస్తాడట. సైరా కోసం మెగాస్టార్ మే వరకు షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది .. కాబట్టి ఆ తరువాత అయన డేట్స్ ఫ్రీ .. దాంతో జూన్ లో సెట్స్ కు వెళ్ళిపోదామని ఆలోచనలో దర్శకుడు ఉన్నాడు. రైతు కథతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి రాజకీయాలకు బ్రేకులు వేసిన మెగాస్టార్ మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఈ సినిమా తరువాత అయన 153 వ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఉంటుందట !!