యువ కథానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్టైనర్ `ABCD`. `అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి` ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని మాట్లాడుతూ - ``అల్లు శిరీష్గారితో `ABCD` సినిమాను చేయడం చాలా హ్యాపీ. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తుంది. జుదా సాంధీ సంగీతం అందించిన ఈ సినిమాలో `మెల్ల మెల్లగా...` , `ముంత కల్లు..` అనే పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఆడియో విడుదల చేస్తున్నాం. అలాగే ఈ చిత్రంతో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. చిత్రీకరణ పూర్తయ్యింది. ప్యాచ్ వర్క్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా మే 17న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.