తెలుగు హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడిప్పుడే క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఈషా రెబ్బ గత ఏడాది ఏకంగా 5 సినిమాలతో ప్రేక్షకులముందుకు వచ్చిన యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా ఈ ఏడాది కూడా జాగ్రత్తగా సినిమాలను ప్లాన్ చేసుకుంటుంది. ఇటీవలే డమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈషా తాజాగా మరో ఆఫర్ కు ఓకే చెప్పింది.
మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జివి ప్రకాష్ కుమార్ కు జోడిగా తమిళంలో ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈషా రెబ్బా. ఏజిల్ ఈ చిత్రాన్ని తెరక్కించనున్నాడు. ఇక ఈషా కు కోలీవుడ్ లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు ఆమె ఓయ్ అనే తమిళ చిత్రంలో నటించింది.