చెన్నైలో కళాసుధ ఉగాది అవార్డుల వేడుక 

04 Apr,2019

గత 20 సంవత్సరాలుగా చెన్నై నగరంలో శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సినిమా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు.  ఈ ఏడాది ఉగాది సందర్బంగా 21 వ ఉగాది పురస్కారాలు పేరుతొ అవార్డులు అందించనున్నారు. ఈ సందర్బంగా కర్టైన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్  ఫిలిం ఛాంబర్ లో గురువారం జరిగింది.ప్రముఖ సీనియర్ దర్శకులు సాగర్ ఉగాది పురస్కారాల బ్రోచర్ ని విడుదల చేసి నిర్మాత మోహన్ వడ్లపట్ల కు అందచేశారు.  ఈ అవార్డుల వేడుక ఈ నెల 7 ఆదివారం రోజున జరుగుతుంది.  

ఈ కార్యక్రమంలో కళాసుధ ప్రసిడెంట్ బేతిరెడ్డి శ్రీనివాస్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దర్శకుడు సాగర్ మాట్లాడుతూ .. గత 20 సంవత్సరాలుగా కళాసుధ పేరుతొ సినిమా అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం. నిజంగా  ఇలాంటి మంచి పని చేస్తున్న శ్రీనివాస్ ని ఈ కమిటీని అభినందిస్తున్నాను. అన్ని పనులు డబ్బుకోసం చేయరు. కొన్ని పనులు సంతృప్తి కి కోసం చేస్తారు, ఇది అలాంటిదే. ఈ ఏడాది అవార్డులు అందుకుంటున్న వారిని అభినందిస్తున్నాను. చెన్నై లో తెలుగు వాళ్ళ సత్తా చాటేలా ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహిస్తున్న వారిని అభినందిస్తున్నాను అన్నారు. 

నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ .. నేను కూడా పదేళ్ల క్రితం కలవరమాయే మదిలో సినిమాకు గాను ఈ అవార్డును అందుకున్నాను. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చెన్నై లో ఈ వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ సారి సినిమా తారలందరూ పాల్గొని కార్యక్రాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు. 

బేతిరెడ్డి  శ్రీనివాస్ మాట్లాడుతూ .. గత ఇరవై ఏళ్లుగా కళాసుధ పేరుతొ ఈ అవార్డు వేడుకలను నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఉగాది సందర్బంగా సినిమా తరాలకు అవార్డులతో సత్కరిస్తున్నాం. సినిమా వాళ్ళ ప్రోత్సహం కూడా ఎంతో ఉంది. ఈ ఎప్పటిలాగే ఈ ఏడాది చెన్నై లోని మ్యూజిక్ అకాడమీ లో ఈ వేడుక జరుగుతుంది . అందరు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నా అన్నారు. చెన్నై లో 7 ఆదివారం రోజున సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం జరుగుతుంది అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఉగాది అవార్డులతో పాటు మహిళా రత్న పురస్కారాలు కూడా అందచేస్తారు. 

Recent News