రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా .. సామాజిక సేవకుడిగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఆయన సరసన నయనతారను హీరోయిన్ గా ఇప్పటికే ఎంపిక చేయగా .. తాజాగా మరో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నట్టు సమాచారం. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. పోలీస్ ఆఫీసర్ గా రజనీని తెరపై ఆయన అభిమానులు చూసి చాలా కాలమే అయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న మురుగదాస్, ఈ పాత్రను మరింత పవర్ఫుల్ గా తీర్చిదిద్దాడని అంటున్నారు. మొత్తానికి వచ్చే సంక్రాంతికి తెలుగు .. తమిళభాషల్లోని మిగతా సినిమాలకి ఈ సినిమా గట్టిపోటీ ఇవ్వనుందన్న మాట.