ఎఫ్ 2 దర్శకుడితో మహేష్ సినిమా 

02 Apr,2019

మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న ''మహర్షి'' చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ నెల 25న విడుదలకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన మొదటి సాంగ్ మంచి క్రేజ్ తెచ్చుకుని, అప్పుడే 2 మిలియన్ వ్యూస్ చేరుకుంది.  మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అల్లరి నరేష్ మరో కీ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ నెక్స్ట్ సినిమా ఏమిటన్న విషయం పై సందిగ్దత నెలకొంది. నిజానికి అయన నెక్స్ట్ సినిమా సుకుమార్ తో ప్లాన్ చేసాడు కానీ సుకుమార్ చెప్పిన కథలేవి మహేష్ కి నచ్చకపోవడంతో మంచి కథ తీసుకురమ్మని చెప్పాడట.  మహేష్ నెక్స్ట్ సినిమా కోసం ఇప్పటికే పలువురు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అయన తదుపరి సినిమా ఎవరితో ఉంటుందన్న విషయం పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. మహేష్ నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడితో ఉంటుందట. ఇప్పటికే అనిల్, మహేష్ తో కథ చర్చలు కూడా జరుపుతున్నాడని తెలిసింది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు నిర్మిస్తాడట.  లేటెస్ట్ గా సంక్రాంతికి ఎఫ్ 2 లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి . 

Recent News