లక్ష్మి రాయ్ ప్రధాన పాత్రలో , వినయ్, రాసి, గీత సింగ్, ముఖ్య పాత్రల్లో పిటి సెల్వకుమార్ దర్శకత్వంలో తమిళంలో హిట్టయిన చిత్రాన్ని సంజన రెడ్డి పేరుతొ వాని వెంకట రమణ సినిమాస్ బ్యానర్ పై కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డబ్బింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానున్న నేపథ్యంలో సోమవారం ఫిలిం ఛాంబర్ లో చిత్ర టీజర్ ని విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిరంతలు సాయి వెంకట్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు. ముఖ్య అతిధులు టీజర్ ని విడుదల చేసారు. అనంతరం రామ సత్యనారాయణ మాట్లాడుతూ .. రాయ్ లక్ష్మి హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉంది. ఈ మద్యే వెంకటలక్ష్మి పేరుతొ మంచి విజయాన్ని అందుకుంది. ఆమె టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం అర్జున్ రెడ్డి రేంజ్ లో హిట్టవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. సాయి వెంకట్ మాట్లాడుతూ .. మా మిత్రుడు నిర్మిస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ముక్యంగా ట్రైలర్ చూస్తుంటే మంచి యాక్షన్ సినిమాగా అనిపిస్తుంది. గ్లామర్ తో పాటు లక్ష్మి రాయి యాక్షన్ పెద్ద హైలెట్ కానుంది అన్నారు. నిర్మాత రవీంద్ర కళ్యాణ్ మాట్లాడుతూ .. తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని సంజన రెడ్డి పేరుతొ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఇప్పటికే పాటలు, ట్రైలర్ బాగా ఆకట్టుకుంటున్నాయి. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందన్న నమ్మకం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు .