అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి చేస్తున్న తొలి సినిమా ' మజిలీ'.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ని షైన్ స్క్రీన్ బ్యానర్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుండగా, గోపి సుందర్ సంగీతం, ఎస్.ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ , సాంగ్స్ కి విశేష స్పందన లభిస్తుంది.. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లు హాజరయ్యారు.. చిత్ర ఆడియో సీడీ ని విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసి నాగార్జునకు అందచేశారు. అనంతరం డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ..అందరికి నమస్కారం.. మా మజిలీ సినిమాకి విషెష్ చెప్పడానికి వచ్చిన నాగార్జున, వెంకటేష్ గారికి థాంక్స్....నిన్ను కోరి తర్వాత ఆ జోనర్ లో కాకుండా వేరే జోనర్ లో ఏదైనా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు చైతు గారు ఫోన్ చేసి సినిమా చేయాలనీ అడిగారు.. ఆ టైం లో నాదగ్గర ఏ కథ లేదు.. ఇరవై రోజుల తర్వాత ఒక ఐడియా ఫ్లాష్ అయ్యింది.. వెంటనే హీరో పాత్ర గురించి చెప్పాను.ఆయనకు బాగా సూట్ అయింది అనిపించింది.. చైతు గారికోసం మాత్రమే తయారు చేసిన కథ ఇది.. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరా అనుకున్నప్పుడు సమంత గారు తప్ప వేరే ఎవరు ఫ్లాష్ అవలేదు.. సినిమా బిజినెస్ కోసం సమంత ని తీసుకోలేదు. ఈ పాత్రను ఆవిడ తప్ప ఎవరు చేయలేదనే ఆమెను ఎన్నుకున్నాం... ఇద్దరు సినిమా కోసం ప్రాణం పెట్టారు.. సమంత గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు..ఆమె ఇరగదీశారు..ఆమె పెర్ఫార్మన్స్ చూస్తూనే స్క్రిప్ట్ లో ఏమైనా తక్కువ రాశానా అనిపిస్తుంది.. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే చైతు నటన..అయన అదరగొట్టారు.. సినిమా చుసిన తర్వాత కౌగిలించుకుని ఏడ్చేస్తారు..అంత బాగా నటించారు.. సినిమాలో అందరు చాల బాగా నటించారు. రావు రమేష్ గారు, పోసాని గారు అద్భుతంగా నటించారు..మిడిల్ క్లాస్ ఫామిలీ లో పెళ్లి తర్వాత ఉండే లవ్ స్టోరీ సినిమా ఇది.. ఇలాంటి మంచి ఫీల్ ఉన్న సినిమా ని, కమర్షియల్ హంగులు లేని ఈ సినిమా ని నమ్మి ఒప్పుకున్న ప్రొడ్యూసర్స్ గారికి చాల థాంక్స్.. సినిమా చాల బాగుంటుంది.. టెక్నిషియన్స్ బాగా పనిచేశారు..లాస్ట్ మినిట్ లో తమన్ దేవుడిలా వచ్చాడు.. మంచి మ్యూజిక్ ఇచ్చారు.. గోపి సుందర్ గారు మంచి పాటలు ఇచ్చారు.. దివ్యాన్ష కౌశిక్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది.. తెలుగులో మంచి అవకాశాలు రావడం ఖాయం.. అటు ఐపీఎల్ ఉన్నా, ఎలక్షన్స్ ఉన్నా సినిమా చాలా బాగా ఆడుతుంది అందరు తప్పకుండ చూడండి.. అన్నారు..
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. ఈ సినిమా ని ఆశీర్వదించడానికి వచ్చిన నాగార్జున గారికి, వెంకటేష్ గారి కి, అభిమానులకు చాల థాంక్స్.. ఈ సినిమా తప్పకుండ మంచి సినిమా అవుతుంది..చైతు, సమంత గారి సపోర్ట్ మర్చిపోలేనిది.. నాకు అన్ని విధాలా సహకరించిన చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు.. ఇంత మంచి సినిమా చేసిన శివ నిర్వాణ గారికి కృతజ్ఞతలు అన్నారు..
హీరోయిన్ సమంత అక్కినేని మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ కి వచ్చిన నాగార్జున గారికి, వెంకటేష్ గారికి చాల థాంక్స్.. వారు రావడం వల్లే ఈ ఫంక్షన్ కి ఇంత క్రేజ్ వచ్చింది.. మజిలీ సినిమా ఒక యూనిక్ నిజమైన లవ్ స్టోరీ.. ఏమాయచేశావే, మనం తర్వాత మజిలీ సినిమా నా కెరీర్ లో ఎఫెక్టివ్ సినిమా గా మిగిలిపోతుంది.. ఇంత మంచి సబ్జెక్ట్ కోసం నన్ను సెలెక్ట్ చేసిన శివ నిర్వాణ గారికి చాల థాంక్స్.. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే లవ్ స్టోరీ పై సినిమా రాలేదేంటా అనుకునే టైం లో శివ గారు మజిలీ స్టోరీ చెప్పారు.. కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నాను. అన్నారు..
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. మజిలీ టీజర్ చూడగానే సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నాను.. ఈ సినిమా ని అద్భుతంగా తెరకెక్కించాడు శివ.. ట్రైలర్ లో చూసినప్పుడే అయన పనితనం తెలిసింది. నిన్ను కోరితోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.. ఇప్పుడు ఈ సినిమా తో మళ్ళీ హిట్ కొట్టబోతున్నాడు.. చైతు, సమంతల కు బెస్ట్ సినిమా అవుతుంది.. అన్నారు..
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. సినిమా టీం అంత చాల కాన్ఫిడెన్స్ గా ఉంది.. మంచి విషయం.. రెండు పాటలు చాల బాగున్నాయి అని విన్నాను.. చాల హ్యాపీ గా ఉంది.. అందరికి అల్ ది బెస్ట్..నిన్ను కోరి సినిమా చూసి చాలా బాగుందనుకున్నాను.. ఆ తర్వాత చైతు తో కలిసి మజిలీ సినిమా చేయడం చాలా ఆనందకరమైన విషయం.. ట్రైలర్ చాల బాగుంది..చూస్తుంటే రెండు సార్లు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.. సినిమా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను..అందరు శ్రద్ధతో చాలా కష్టపడి సినిమా చేశారు.. ఈ ఉగాది మాకు సంతోషకరమైన ఉగాది అవబోతుంది.. మజిలీ టీమ్ కి అల్ ది బెస్ట్ అన్నారు.