రానా తన తదుపరి చిత్రంలో నక్సలైట్ గా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్రతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో రానా ఆ తరువాత సోలో హీరోగా చేస్తూనే మరో వైపు ఇతర హీరోల సినిమాల్లో కీ రోల్స్ లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఈ మద్యే హిందీ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకున్న రానా ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బిజీ అయ్యే ప్రణాళికలు వేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు గుణశేఖర్ హిరణ్య కశిప అంటూ ఓ భారీ బడ్జెట్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. సురేష్ ప్రొడక్షన్ నిర్మించే ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ భారీ సినిమాకోసం ఏకంగా 180 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారట. ఈ సినిమా తరువాత వేణు ఉడుగుల దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు రానా. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందే ఈ సినిమాలో రానా నక్షలైట్ గా కనిపిస్తాడట. ఈ చిత్రానికి విరాటపర్వం 1992 అనే టైటిల్ ఫిక్స్ చేసారు. వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నించే విప్లవ భావాలూ కలిగిన యువకుడిగా, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను రూపుమాపేందుకు నక్సలైట్ గా మారతాడట. రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సీనియర్ గ్లామర్ హీరోయిన్ టబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుందట.