మా మధ్య ఎలాంటి ప్రేమ లేదంటున్న దర్శకుడు 

31 Mar,2019

దర్శకుడు ఏఎల్ విజయ్ తో సాయిప‌ల్ల‌వి ప్రేమలో పడిందనీ .. ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలు వున్నాయనే వార్తలు ఈ మధ్య వైరల్ గా మరీనా విషయం తెలిసిందే. గతంలో ఈ దర్శకుడితో సాయిపల్లవి ‘కణం’ సినిమా చేసింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ విషయంపై సాయిపల్లవి మౌనంగానే వుంది. తాజాగా ఏఎల్ విజయ్ స్పందిస్తూ ..”నేను .. సాయిపల్లవి ప్రేమించుకుంటున్నట్టు .. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇదంతా పనిలేనివాళ్లు చేస్తున్న ప్రచారం మాత్రమే అని తేల్చి చెప్పాడు. కలిసి సినిమాలో పనిచేస్తే అనవసర లింకులు పెట్టి నానా హంగామా చేస్తున్నారని అయన మండి పడ్డారు. ప్రస్తుతం ఈ దర్శకుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ జయ పాత్రలో నటిస్తుంది. 

Recent News