మై డియర్ మచ్చా ...నీ గుండెల్లో గుచ్చా ... అంటూ తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన మారి 2 సినిమాలోని సాంగ్ ఓ రేంజ్ లో ఊపేస్తోంది? నిజానికి ఈ సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాన్ని అందుకోకపోయినా కూడా సాంగ్ మాత్రం జనాలకు బాగా నచ్చింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా తెలుగులో మారి పేరుతొ విడుదలైంది. ధనుష్ సరసన సాయి పల్లవి నటించిన ఈ సినిమా పాటకు మూడువందల మిలియన్ వ్యూస్ రావడం విశేషం. అయితే ఈ సాంగ్ జోరు ఇంకా కొనసాగుతుందని ఖచ్చితంగా 500 వ్యూస్ వస్తాయని అంటున్నారు. సౌత్ లో ఓ సాంగ్ కి ఇన్ని వ్యూస్ రావడం నిజంగా విశేషమని చెప్పాలి. రౌడీ బేబీ వీడియొ సాంగ్ ని ఇన్ని లక్షల మంది చూడడం .. ధనుష్, సాయి పల్లవి స్టెప్పులు కూడా మరో కారణం కావొచ్చని అంటున్నారు. మొత్తానికి రౌడీ బేబీ సాంగ్ హవా ఇలాగె కొనసాగితే త్వరలోనే 50 కోట్ల వ్యూస్ చేరుకోవడం పెద్ద విషయమేమి కాదంటున్నారు విశ్లేషకులు.