కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగీలా ఊర్మిళ 

28 Mar,2019

రంగీలా చిత్రంలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్న గ్లామర్ హీరోయిన్ ఊర్మిళ గుర్తుందిగా .. ఈ మధ్య ఎక్కడ ఏ సినిమాలో కనిపించడం లేదు. దాదాపుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఊర్మిళ  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తున్న ఈమె  కాంగ్రెస్ లో చేరనుంది. దాంతో పాటు ముంబై నార్త్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. గతంలో ఈ నియోజకవర్గం నుండి నటుడు సునీల్ దత్ ఐదుసార్లు పార్లమెంట్ కు ఎంపికయ్యారు. సినిమా గ్లామర్ క్రేజ్ ఈ ప్రాంతంలో బాగా ఉండడంతో అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉర్మిళను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఊర్మిళ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం తీసుకుంది. 

Recent News