ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్న కామ్రేడ్ 

27 Mar,2019

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజా చిత్రం డియర్ కామ్రేడ్ సంచలనం రేపుతోంది. నిజానికి ఈ  సినిమా  విడుదలకు చాలా టైం ఉన్నప్పటికీ బిజినెస్ కు సంబంధించిన డీల్స్ ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతున్నాయి. టీజర్ వచ్చాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. గీత గోవిందం ని మించిన ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో ట్రేడ్ భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోంది. నిర్మాతలు మైత్రి సంస్థ ఎక్కడిక్కడ రీజనబుల్ డీల్స్ అనిపించినవి ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు నైజామ్ సీడెడ్ కు కలిపి ఓ భారీ మొత్తానికి చదలవాడ శ్రీనివాసరావు తీసుకున్నట్టు తెలుస్తోంది.  అందులో నైజామ్ హక్కులను ఓ భారీ మొత్తానికి  ఏషియన్ సునీల్ కు ఇచ్చేశారని టాక్. మిగిలిన మొత్తం కంటే ఎక్కువె సీడెడ్ నుంచి వస్తుంది కాబట్టి ఆయన విడుదలకు ముందే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. మరో వైపు ఆంధ్ర లో కూడా భారీ డిమాండ్ ఉంది. ఇక ఓవర్సీస్ గురించి చెప్పాల్సిన పని లేదు.  ఇదంతా పక్కన పెడితే తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషాకా బాష విడిగా క్రేజ్ రావడంతో డియర్ కామ్రేడ్ నిజంగా కేక పుట్టించేలా ఉన్నాడు. 

Recent News