తెలుగు ,తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఫిదా చేసిందో ఆమె చేసిన సినిమాలను చుస్తే తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రేమలో పడిందంటూ కోలీవుడ్ కోడై కూస్తుంది ? అయితే సాయి పల్లవి ప్రేమాయణం ఓ దర్శకుడితో నట !! ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో చెబితే మీరు షాక్ అవుతారు ? అయన ఎవరో కాదు తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ !! అదే ఆ మధ్య కోలీవుడ్ గ్లామర్ భామ అమల పాల్ మాజీ భర్త !! ఇదివరకే ఈ దర్శకుడితో కలిసి సాయి పల్లవి కణం అనే సినిమా చేసింది. భిన్నమైన సినిమాగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి సాయి పల్లవి ప్రేమాయణం గురించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.