మే 1న అర్జున్ సురవరం 

25 Mar,2019

యువ క‌థానాయ‌కుడ నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్‌, ఆరా సినిమా ప్రై.లి. ప‌తాకాల‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల‌, కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. మే 1న న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా  జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో... హీరో నిఖిల్ మాట్లాడుతూ ``నా తొలి సినిమా హ్యాపీడేస్ నుండి అర్జున్ సుర‌వరం వ‌ర‌కు మీడియా న‌న్ను ఎంత‌గానో స‌పోర్ట్ చేసింది. `అర్జున్ సుర‌వరం` నా 16వ సినిమా. నా స‌క్సెస్‌కు కార‌ణ‌మైన మీడియా వాళ్ల‌పై సినిమా చేయ‌డం రెస్పాన్సిబుల్‌గా ఫీల‌య్యాను. జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. టాప్ రిపోర్ట‌ర్ కావాల‌నుకునే యువ‌కుడిగా క‌న‌ప‌డ‌తాను. ఈ సినిమా చేయ‌డానికి ముందు కాస్త భ‌య‌ప‌డ్డాను. క‌త్తి మీద సాములాంటి సినిమా. చాలా డేలికేట్ పాయింట్‌తో తెర‌కెక్కింది. మీడియాలోని చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చూపించాం. నా కెరీర్‌లో చాలా బాధ్య‌త‌గా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని, చేసిన సినిమా. ఓ ప్ర‌భుత్వం నిల‌బ‌డాల‌న్నా.. కూలిపోవాల‌న్నా.. యుద్ధం మొద‌లు కావాల‌న్నా.. ఆగిపోవాలన్నా.. మీడియానే కీ రోల్ పోషిస్తుంది. ప‌వ‌ర్‌ఫుల్ మీడియాను రెప్ర‌జెంట్ చేయ‌డం గ‌ర్వంగా ఉంది. `అర్జున్ సుర‌వ‌రం` సినిమా మే 1న విడుద‌ల‌వుతుంది. మా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామ‌ని అడుగుతున్నారు. పోస్ట్‌పోన్ ఉంది. పోస్ట్ పోన్ అయిన ప్ర‌తిసారి స‌క్సెస్ అవుతూనే వ‌చ్చాను. ఉదాహ‌ర‌ణ‌కు కార్తికేయ సినిమానే. ఏది జ‌రిగినా మ‌న మంచికే అన‌కుంటున్నాం. కంటెంట్ బావుంటే సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం. మా నిర్మాత‌లు ఠాగూర్ మ‌ధుగారు, రాజ్‌కుమార్‌గారు మేకింగ్‌లో ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. ఎంత ఖ‌ర్చు అయినా.. ఓవ‌ర్ బ‌డ్జెట్ అయినా సినిమా బాగా రావాల‌ని నిర్మాత‌లు నిల‌బ‌డి సినిమాను పూర్తి చేశారు. ప్ర‌జ‌లంతా ఎల‌క్ష‌న్స్ మూడ్‌లోనే ఉన్నారు. చాలా కాంట్ర‌వ‌ర్సీలు కూడా ఉన్నాయి. వాట‌న్నింటికీ దూరంగా మా సినిమాను మే 1న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ నిర్ణ‌యించుకున్నారు. ఏషియ‌న్ సునీల్‌గారు పిల్ల‌ర్‌లా మా సినిమాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఆయ‌న నైజాంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఓవ‌ర్‌సీస్ డిస్ట్రిబ్యూట‌ర్ కూడా లార్జ్‌గా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇంత గ్రాఫిక‌ల్ సినిమాను నా కెరీర్‌లో చేయ‌లేదు. అంతా గ్రాపిక్స్ ఉన్నాయి. సినిమా కంప్లీట్‌గా రెడీ అయ్యింది. 2గంట‌ల 20 నిమిషాల ర‌న్ టైంతో లాక్ అయ్యింది. మే డే నాడు ప్రేక్ష‌కుల‌కు క‌లుస‌కోబోతున్నాం. కుటుంబ‌మంతా క‌లిసి చూసే సినిమా ఇది. ఠాగూర్ సినిమాలో మ‌ధుగారు ఎంత మంచి పాయింట్ అయితే చూపించారో.. ఆయ‌న స్ట‌యిల్లో ఆయ‌న బ్యాన‌ర్‌కు త‌గ్గ‌ట్లు కొత్త పాయింట్‌ను బ్యూటీఫుల్‌గా చెప్పాం`` అన్నారు. 
నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ `` సినిమా అంతా రెడీ అయ్యింది. ప్ర‌జ‌లంద‌రూ ఎల‌క్ష‌న్ మూడ్‌లో ఉన్నారు. మీడియాకు రిలేటెడ్‌గా ఉన్న సినిమా. సినిమాను మే 1న విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం. అంద‌రి స‌హ‌కారం కోరుకుంటున్నాం`` అన్నారు.

Recent News