హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో సినీ నటుడు వెంకటేష్ పెద్ద కుమారై ఆశ్రీత వివాహం జరుగుతుంది. ఆశ్రీత, వినాయక్ ల ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో.. పెద్దల కుదిరించిన ప్రేమ వివాహంగా నిర్వహిస్తున్నారు. జైపూర్ లో భారీ ఎత్తున వివాహ మహోత్సవ కార్యక్రమాలను ప్లాన్ చేశారు. దగ్గుబాటి కుటుంబంతో పాటు అక్కినేని కుటుంబం ఈ వేడుకలో సందడి చేసింది. జైపూర్ లో జరుగుతున్న వివాహ మహోత్సవ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. సల్మాన్.. వెంకటేష్ లు మంచి స్నేహితులు. ఈ స్నేహంతో సల్మాన్ ఖాన్ ఈ వేడుకకు హాజరయ్యి సందడి చేశారు. అలాగే రామ్ చరణ్, ఉపాసన, మిగతా సినీ ప్రముఖులు హాజరయ్యారు.