Mr. పర్ఫెక్షనిస్ట్ గా క్రేజ్ తెచ్చుకున్న అమీర్ ఖాన్ ఏ పాత్ర టేకప్ చేసినా ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేస్తాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తన వైపు నుండి 100% ఎఫర్ట్స్ పెడతాడు. అందుకే అమీర్ ఖాన్ ఏ ప్రాజెక్ట్ ను సైన్ చేసినా అది వెంటనే క్రేజీగా మారిపోతుంది. ఇక అమీర్ ఖాన్ లుక్స్ విషయంలో.. గెటప్స్ విషయంలో చేసే ప్రయోగాలకు అసలు లెక్కే ఉండదు. తాజాగా ఆమీర్ ఒక కొత్త లుక్ తో అందరినీ షాక్ కు గురి చేశాడు. అమీర్ ఖాన్ తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో సాధారణంగా ఉన్న అమీర్ ను మేకప్ సాయంతో ఒక వయసు పైబడిన వ్యక్తిగా మార్చడం ఉంది. సగం బట్టతల.. మిగతా సగం తెల్లటి జుట్టు.. తెల్ల మీసాలతో అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు అమీర్. ఈ వీడియోకు "కమింగ్ సూన్.. ఆప్ కే ఫోన్ పే" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అందరూ ఏమై ఉంటుందా.. ఇది తన కొత్త సినిమా గెటప్పా.. అని ఆసక్తిగా ఎదురుచూశారు. ఇంతకీ విషయం ఏంటంటే 'ఫోన్ పే' పేమెంట్స్ యాప్ కు అమీర్ బ్రాండ్ అంబాజిడర్ గా డీల్ కుదుర్చుకున్నాడు. ఈ బ్రాండ్ యాడ్ షూటింగ్ కోసం ఇలా గెటప్ మార్చాడన్నమాట.