మేర్లపాక గాంధీ తో చైతు 

25 Mar,2019

అక్కినేని నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరో వైపున బాబీ దర్శకత్వంలో చైతూ 'వెంకీమామ'ను కూడా చకచకా కానిచ్చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత చైతూ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, ఈ కాంబినేషన్లో సినిమా ఉందనేది తాజా సమాచారం. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. 'వెంకీమామ' షూటింగు పూర్తయిన తరువాత చైతూ ఈ సినిమాతో సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. పాత 'దేవదాస్' కథ ఆధారంగా విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ కథ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Recent News