పేరు మార్చుకున్న మెగా హీరో 

21 Mar,2019

వరుసగా ఆరు పరాజయాలు వెంటాడడంతో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ న్యూమరాలజీ పై ఆధారపడ్డాడు, అందుకే తన  పేరు మార్చుకున్నాడు.  నెక్స్ట్ మూవీ తప్పకుండా హిట్ కావాలనే పట్టుదలతో సాయి ధరమ్ ఉన్నాడు. తన తాజా చిత్రం 'చిత్రలహరి' కోసం లుక్ దగ్గర నుంచి సినిమా కథాంశం వరకు అన్నీ మార్చుకున్నాడు. తన పేరును సైతం మార్చేశాడు. ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో అతని స్క్రీన్ నేమ్ సాయి ధరమ్ తేజ్ అని పడేది. 'చిత్రలహరి'లో మాత్రం కేవలం సాయి తేజ్ అని పడుతోంది. లక్ కోసమే ఆయన తన పేరును ట్రిమ్ చేశారనే టాక్ వినపడుతోంది. ఈ కొత్త పేరు సాయి తేజ్ కు ఎలా కలిసొస్తుందో వేచి చూడాలి.

Recent News