నాగబాబు నాకు 30 ఏళ్లుగా స్నేహితుడు. నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది. నాగబాబు.. తరువాత చెబుతాను" అని నటుడు శివాజీరాజా వ్యాఖ్యానించారు. 'మా' ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన, మీడియాతో తనకు ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉందని, తాను కుట్రలు చేసేవాడినో, కాదో మీడియా మొత్తానికీ తెలుసునని అన్నారు. ప్రతి సంవత్సరమూ 'మా' డైరీని అందంగా డిజైన్ చేసి వేస్తామని, ఈ సంవత్సరమూ బాగా చేశామని అన్నారు. డైరీ వేసినందుకు రూ. 14.20 లక్షలు వచ్చిందని గొప్పగా చెప్పుకున్న నరేశ్, కేవలం రూ. 7.20 లక్షలు మాత్రమే ఖాతాలో వేశారని, మిగతా డబ్బు ఏమైందని ఆయన ప్రశ్నించారు. తాను లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చిందని, ఒకటో తేదీలోగా మిగతా డబ్బు 'మా' ఖాతాలో వేయాలని నరేశ్ ను డిమాండ్ చేశారు. మిగతా డబ్బు ఎక్కడుందో చెప్పి, వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.