విజయ్ సినిమాకు సాటిలైట్ క్రేజ్ 

20 Mar,2019

తమిళ స్టార్ హీరో విజయ్  తన 63వ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. అట్లీ కుమార్  దర్శకత్వం వహిస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ కోచ్ గా కనిపించనున్నాడు. గతంలో అట్లీ కుమార్ - విజయ్ ల కాంబినేషన్లో తెరకెక్కిన 'తెరి',  'మెర్సల్' చిత్రాలు  భారీ విజయాలను అందుకున్నాయి. అందువల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ కారణంగా ఈ సినిమా శాటిలైట్ హక్కుల విషయంలో ఛానల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి శాటిలైట్ హక్కులను సన్ టీవీ వారు భారీ రేటుకు  దక్కించుకున్నట్టుగా సమాచారం. శాటిలైట్ హక్కుల పరంగా కోలీవుడ్లో ఇంతవరకూ అత్యధిక రేటుకు అమ్ముడైన సినిమా ఇదే అనే టాక్ వినిపిస్తుంది.  నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నారు.

Recent News