సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్". రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఒక ఎమోషనల్ డ్రామాగా రూపొందుతుంది. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో టీజర్ ను విడుదల చేశారు. టీజర్లో స్టూడెంట్ నాయకుడిగా విజయ్ దేవరకొండ చేసే ఫైట్స్... రష్మిక తో చేసిన రొమాంటిక్ సన్నివేశాలు నేచురల్గా ఉన్నాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ సంగీత సారధ్యంలో ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడినబ్యూటిఫుల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ప్రస్తుతం హైదరాబాదులో ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే 31న గ్రాండ్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.